డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల ;వేములవాడ తహశీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం సాయంత్రం పరిశీలించారు.అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి హోమ్ ఓటింగ్ , ఫేలిసిటేషన్ సెంటర్ లో 80 ఎండ్లకు పైగా వృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల విధులలో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సీల్డ్ కవర్ లో సేకరించిన పోస్టల్ బ్యాలెట్ లను ఇక్కడ భద్రపరుస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ...
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూంలో గట్టి బందోబస్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు కార్యక్రమాల్లో వేములవాడ ఆర్డీఓ మధు సూదన్ తదితరులు పాల్గొన్నారు