సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు
స్పీకర్ పై బీఆర్ఎస్ సభ్యుల అసభ్య ప్రవర్తన పై నిరసనగా పేపర్ విసిరాను
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన ఆర్ఓఆర్ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు నూతన ఆర్ఓఆర్ చట్టం ను అడ్డుకునే క్రమములో స్పీకర్ పోడియం పైపుకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ శాసన సభ్యుడు కే. పి.వివేకానంద్ గొప్ప హోదాలో ఉన్న దళిత స్పీకర్ పై బుక్ ను విసిరారు. ఆ వెంటనే మరో బీఆర్ఏస్ శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి ప్లక్ కార్డులు చించి స్పీకర్ పై విసిరినందున నిరసనగా పేపర్ అందుకొని కౌశిక్ రెడ్డి పై విసిరాను. పేపర్ విసిరితే దాన్ని చెప్పులు విసిరినట్లు అసత్య ప్రచారం చేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. కావాలంటే అసెంబ్లీ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుందని తెలిపారు.