డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:మైనర్ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అపహరించి లైంగిక దాడికి సంబంధించి పోక్సో చట్టం కింద నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు.రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుంజా గురుస్వామి(23) బట్టిప్రోలు గ్రామం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ వాసికి అండర్ సెక్షన్ 366(ఏ),376(ఏ) ఐపిసి & సెక్షన్ 4 ఆఫ్ పోక్సో చట్టం వనస్థలిపురం స్టేషన్ ఎస్.సి నెం 114/2018 కేసు నమోదుకాగా, పోలీసులు విచారణ చేశారు.నిందితుడు గుంజా గురుస్వామి (23) దోషిగా తేలడంతో రంగారెడ్డి జిల్లా ఎల్బినగర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడిని శుక్రవారం దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష మరియు రూ.16,000/- జరిమానా విధించబడింది మరియు బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది.
News
పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష