ముఖ్య అతిథిగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా: మైపతి అరుణ్ కుమార్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు,ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ హాజరయ్యారు,వారు మాట్లాడుతూ మా ఊర్లో మా రాజ్యం అనే నినాదంతో ఆదివాసులు అంతా ముందుకు నడవాలని,హాక్కుల కోసం పోరాడాలని, ఏజెన్సీ ప్రాంతాలలో కొందరు రాజకీయ నాయకులు మరియు గిరిజనేతరులు మా చట్టాలను తుంగలో తొక్కుతున్నారని, ప్రభుత్వాలు మారుతున్న ఆదివాసి బతుకులు మారడం లేదు,కొత్తగూడెం జిల్లాలో నలుగురు ఆదివాసి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కూడా మన హక్కుల గురించి ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడింది లేదని, ఆదివాసి యువత మరియు పెద్దలు మన ఆదివాసి హక్కుల గురించి పోరడాటానికి సిద్ధంగా ఉండాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండారు సూర్యనారాయణ తంబల్ల రవి,కారం నాగేంద్ర,వాసం పోలయ్య,యాట్లా శివ,పోతురాజు,తదితరులు పాల్గొన్నారు.