డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతీసేలా ప్రభుత్వం దాడికి దిగుతోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకుల లకావత్ గిరిబాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పై కుట్ర, కక్షపూరిత చర్యలు చేపడుతుందన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.. గడచిన కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని ఘటనల్లోనూ కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎలాగైనా కేటీఆర్ ను జైలులో పెట్టాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఎన్ని అక్రమ కేసులు బనాయించినా.. ఎలాంటి విచారణకైనా కేటీఆర్ సిద్దంగా ఉన్నారని తెలిపారు.
News
ఎలాగైనా కేటీఆర్ ను జైలులో పెట్టాలనే కుట్ర : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు