| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"కథల తోటలో" కుసుమ రామయ్య విద్యార్థుల కథలు

"కథల తోటలో" కుసుమ రామయ్య విద్యార్థుల కథలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రంగినేని ట్రస్ట్ లో ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పత్తిపాక మోహన్ ప్రముఖ కవులు గరిపెల్లి అశోక్, జూకంటి జగన్నాథం, మద్దికుంట లక్ష్మణ్, పెద్దింటి అశోక్ కుమార్ల చేతుల మీదుగా ఆవిష్కరించిన కథల తోట పుస్తకంలో కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్ల విద్యార్థుల జలంధర్ అఖిల సహస్రిక సందీప్ ప్రసన్న లు రాసిన  కథలకు చోటులబించడం పాఠశాలకు గర్వకారణమని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దాసరి రవీందర్ అన్నారు. ఈ కథల తోటలో కథలు రాసిన విద్యార్థులను ఈరోజు ప్రత్యేకంగా అభినందించారు. బడిలో మారసం, తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపయోగపడిందని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటున్నారని అన్నారు.గతంలో విద్యార్థుల రచనలతో సిరిసిల్ల సిరిమల్లెలు పుస్తకం కూడా వచ్చిందని మరో పుస్తక రావడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

విద్యార్థుల రచనల వెనుక తెలుగు భాష ఉపాధ్యాయులు సమ్మయ్య శ్రీనివాసరెడ్డి రాములు  ల కృషి ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాకాల శంకర్ గౌడ్ గోవిందరావు శ్రీహరి నసీరుద్దీన్ మొదలైన వారు పాల్గొన్నారు.

Previous రాజన్న జిల్లా వేములవాడలో వ్యక్తి దారుణ హత్య?
Next ఎలాగైనా కేటీఆర్ ను జైలులో పెట్టాలనే కుట్ర : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
ADVERTISEMENT