| Daily భారత్
Logo




తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... మయోనైజ్ పదార్థంపై ఏడాది పాటు నిషేధం

News

Posted on 2024-10-30 18:27:23

Share: Share


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... మయోనైజ్ పదార్థంపై ఏడాది పాటు నిషేధం

మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం

నేటి నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడి

గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేసే మయోనైజ్

మయోనైజ్ తినడంతో అనారోగ్యం పాలవుతున్న ఘటనలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించింది. మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై ఒక సంవత్సరం నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది అక్టోబర్ 30, 2024 నేటి నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది.మయోనైజ్‌పై అధికారులతో మంత్రి సమీక్ష మంత్రి దామోదర రాజనర్సింహ బుదవారం ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మయోనైజ్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రానికి నిషేధానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కల్తీ ఆహారం తీసుకొని పలువురు అనారోగ్యం పాలవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌లో తరుచూ తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, ఐదు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలన్నారు.


ఏమిటీ మయోనైజ్?


మయోనైజ్‌ ఎక్కువగా బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్, ఇతర ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకొని తినే ఆహార పదార్థం. మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారు. ఉడికించని పదార్థం కాబట్టి మయోనైజ్‌లో హానికర బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ మయోనైజ్ కారణంగా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హోటళ్లు తీరు మార్చుకోకపోవడంతో ఫుడ్ సేఫ్టీ విభాగం రంగంలోకి దిగి నిషేధం విధించాలని నిర్ణయించింది.


బంజారాహిల్స్, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో మయోనైజ్‌ను తిన్నవారు అనారోగ్యానికి గురైనట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లోని పలు హోటళ్లలో దాడుల సమయంలోనూ నాసిరకం మయోనైజ్‌ను అధికారులు గుర్తించారు. అదేవిధంగా, సికింద్రాబాద్, టోలిచౌకి, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, బంజారాహిల్స్‌లోని పలు హోటళ్లలోని షవర్మ, మండి బిర్యానీ, బర్గర్ల పైనా బల్దియాకు ఫిర్యాదులు అందాయి.

Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >