డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణను ఇచ్చి నేడు దేశ విదేశాలలో చాలామందికి ఉపాధి మార్గాలు చూపించడం ఎంతో గొప్ప విషయం అని షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న అభినందించారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో ఆదివారం జరిగిన మైక్రోసాఫ్ట్ టెక్ స్కిల్లింగ్ ప్రాజెక్టు డేటా సైన్స్ ట్రైనింగ్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ శివ వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాకు ఆయన తెలియజేస్తూ.. మూడు నెలలపాటు షాద్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఎంతో విలువైన సుమారు మూడు లక్షల విలువైన శిక్షణను ఉచితంగా అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ మరియు జనరల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ లకు ఉచితంగా 46 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 46 మందిలో ఇప్పటికే 35 మంది ప్యాకేజీలతో దేశ విదేశాలలో ప్లేస్మెంట్లు పొందారని ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపాలిటీ సహకారంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ద్వారా ఇది సాధించడం ఒక గొప్ప విజయంగా మున్సిపల్ కమిషనర్ వెంకన్న అభివర్ణించారు.
News
ఉచిత శిక్షణతో నేడు దేశ విదేశాల్లో ఉద్యోగాలు : మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న