డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దసరా పర్వదినాన్ని. పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఎలికట్ట శ్రీ అంబ భవాని మాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 3 నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ ఆదివారం హైదరాబాదులో నివాసం ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాండ్ర కాశీనాథ్ రెడ్డికి గ్రామ పెద్దలు ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాండ్ర కాశీనాథ్ రెడ్డి నవరాత్రి ఉత్సవాలకు తన వంతు గా లక్ష రూపాయల విరాళాన్ని గ్రామ పెద్దలకు అందజేశారు. అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని కోరారు. నవరాత్రి ఉత్సవాలకు విరాళాన్ని అందజేసిన తాండ్ర కాశీనాథ్ రెడ్డికి గ్రామ పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబ భవాని మాత దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల రాజు, ఆంజనేయ స్వామి దేవాలయ కమిటి చైర్మన్ నారందినేష్ రెడ్డి, నాయకులు జితేందర్ రెడ్డి, అర్ల యాదయ్య యాదవ్, గున్న కృష్ణ యాదవ్, కావలి శ్రీశైలం, రాజు, నారంశ్రీపాదరెడ్డి, శివ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు..
News
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఒక లక్ష రూపాయల విరాళాన్ని అందజేసిన తాండ్ర కాశీనాథ్ రెడ్డి