| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షాద్‌నగర్ లో మహిళ మర్డర్

షాద్‌నగర్ లో మహిళ మర్డర్


డైలీ భారత్, షాద్‌నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. 15వ వార్డు కాలనీవాసులు ఈరోజు తెల్లవారుజామున వాకింగ్ వెళ్లిన సమయంలో కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు వెంటనే స్థానిక పోలీస్ సిబ్బంది వారికి సమాచారం అందించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారు - ఏసిపి

షాద్ నగర్ పట్టణంలోని ఫరుక్ నగర్ శ్రీనివాస కాలనీలో శనివారం గుర్తు తెలియని మహిళ శవం పోలీసులకు లభించింది. కోర్టు పక్కన ఫర్లాంగు దూరంలో ఇళ్ల మధ్యలో ఒక ప్లాస్టిక్ కవర్ లో బ్లాంకెట్ లో చుట్టి శవాన్ని ఇక్కడ పడేసినట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ సందర్భంగా ఏసీపి రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ. సుమారు 35 నుండి 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళను ఎక్కడో చంపేసి ఇక్కడ పడేసినట్లు ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

Previous 9వ అంతస్తు నుండి దూకి మహిళ సాప్ట్ వేర్ ఆత్మహత్య
Next హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్!
ADVERTISEMENT