| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

9వ అంతస్తు నుండి దూకి మహిళ సాప్ట్ వేర్ ఆత్మహత్య

9వ అంతస్తు నుండి దూకి మహిళ సాప్ట్ వేర్ ఆత్మహత్య

డైలీ భారత్, హైదరాబాద్:9వ అంతస్తు పై నుండి దూకి మహిళ సాప్ట్ వేర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‎లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు చోటు చేసుకుంది

పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్ మయూరి నగర్‎లోని దివ్య శక్తి అపార్ట్మెంట్స్‎లో భర్త, బాబుతో కలిసి ఉంటోన్న సాయి సింధూర(29) సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు భర్తతో విభేదాల వల్ల సాయి సింధూర డిప్రెషన్‎కు గురైంది. ఈ క్రమంలోనే ఇవాళ తాము ఉంటున్న అపార్ట్మెంట్ 9వ అంతస్తు పై నుండి దూకిన ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర రక్త స్రావం కావడంతో సాయి సింధూర ఘటన స్థలిలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‎కు తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Previous మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
Next షాద్‌నగర్ లో మహిళ మర్డర్
ADVERTISEMENT