| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తితిదే కు తొలిసారిగా పలాస జీడిపప్పు

తితిదే కు తొలిసారిగా పలాస జీడిపప్పు

జెండా ఊపి లారీని ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష

డైలీ భారత్, పలాస/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పును గురువారం పంపించారు. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీడిపప్పు సరఫరా చేసేందుకు కాశీబుగ్గ పారిశ్రామికవాడలోని ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ఉత్పత్తుల సంస్థకు ఇటీవల టెండర్ ఖరారైంది. ఈ మేరకు 10 టన్నుల సరకును పంపించారు. నాణ్యతలో రాజీపడకుండా మేలురకం పంపిస్తామని సంస్థ యజమాని సంతోష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

Previous మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య..
Next దేవర సినిమా ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు
ADVERTISEMENT