| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య..

మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య..

డైలీ భారత్, మహబూబాబాద్:మంత్రాల నేపంతో వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మల్లం యాకయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. తనపై మల్లం యాకయ్య మంత్రాలు చేశాడు అనే అనుమానంతో నడిరోడ్డుపై దారుణంగా కొట్టి చంపానని నిందితుడు గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. యాకయ్యనే మంత్రాలు చేశాడని అనుమానం ఎందుకు వచ్చిందని నిందితున్ని ప్రశ్నించాగా.. అతనే నాపై మంత్రాలు చేశాడు అందుకే తన కోసం కాపు కాచి చంపానని ఒప్పుకున్నాడు. దీంతో యాకయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితున్ని పట్టుకుని, తాళ్లతో చెట్టుకు కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులో తీసుకున్నారు. యాకయ్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అసలు యాకయ్యనే మంత్రాలు చేశాడని నిందితుడికి ఎవరు చెప్పారు? నిందితునికి మృతి చెందిన యాకయ్య ఇద్దరు బంధువులా? లేక ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? అనే రీతిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


#mahabubabad

Previous 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డ హాస్టల్ వార్డెన్ కు మరణ శిక్ష
Next తితిదే కు తొలిసారిగా పలాస జీడిపప్పు
ADVERTISEMENT