| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేదల పాలిట కాంగ్రెస్ అభయహస్తం : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పేదల పాలిట కాంగ్రెస్ అభయహస్తం : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం..

రూ.500 లకే సిలిండర్ అందిస్తాం

కొత్తూరు మున్సిపాలిటీలో 1,454 మందికి అభయ హస్తం బాండ్ల అందజేత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేదల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం ఓ గొప్ప అభయహస్తమని, ప్రజా పాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్ మండలం కొత్తూర్ పాత మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ ద్వారా రూ.500 లకు వంట గ్యాస్ పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను లబ్దిదారులకు స్వయంగా అందజేశారు. అదేవిధంగా 1454 మందికి అవయహస్తం బాండ్లను అందించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలొ హామీ ఇచ్చిన విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలుచేస్తామని   తెలిపారు. ప్రతి పక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో గొప్ప విప్లవత్మకమైన మార్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. సంక్షేమం నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్తూరు మున్సిపాలిటీలో 1,454 మందికి అభయ హస్తం బాండ్లు పంపిణి చేశారు.


ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నేత హరినాథ్ రెడ్డి,  జగన్, అపారెడ్డి గూడ మల్లేశ్ ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Previous జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆటల పోటీలకు స్పోర్ట్స్ కిట్ వితరణ
Next బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసినప్పుడే స్థానిక సంస్థల్లో గెలుస్తాం
ADVERTISEMENT