కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
సిద్దాపూర్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు మంగలి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కావడం జరిగింది.
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కల్గిన పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. గత పది సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లోకెల్లా మన దేశాన్ని అగ్రగామిగా నిలిపారని అన్నారు.
అన్ని వర్గాల అభివృద్దె లక్ష్యంగా మోదీ గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టే ప్రజలు భాజపా సభ్యత్వం తీసుకోడానికి ముందుకొస్తున్నారని అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో రెండు వందలకు తగ్గకుండా సభ్యత్వం చేసి పార్టీ ని పటిష్టం చేయాలని కోరారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసినప్పుడే స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, సభ్యత్వ సహ ప్రముఖ్ గణేష్, హరికృష్ణ, నవీన్, గుండెమోని మల్లేష్, నర్సింహా,మొహనా చారి, వంశీ చారి, కొండల్ చారి, సూరి, భైరమోని నర్సింహా, శివ, ఫెరోజ్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.