| Daily భారత్
Logo




కోఠి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెడతాం : సిఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2024-09-10 23:07:32

Share: Share


కోఠి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెడతాం : సిఎం రేవంత్ రెడ్డి

హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు

చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్

ఐలమ్మ మనవరాలు శ్వేతను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తాం.

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ఏర్పాటుకు పోరాట నారీమణి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గడీ కంచెను బద్దలుగొట్టి ప్రజా భవన్ కు జ్యోతిరావు పూలే పేరు పెట్టామని, హ్యాండ్లుమ్ యూనివర్సిటీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని, కోఠి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నామని ముఖ్యమంత్రి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తొలిసారిగా సాంప్రదాయ కూచిపూడి, జానపద శైలిలో నృత్య రూపకం ప్రదర్శించారు. అభినయ కళాతపస్వి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం ఈ ప్రదర్శన చేసి రాజకీయ దిగ్గజాలు, కళాప్రియుల ప్రశంసలు అందుకున్నారు. 

చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను నాట్య రూపంలో తిలకించి జోహార్ ఐలమ్మ, జై తెలంగాణ అంటూ రవీంద్రభారతి ఆడిటోరియం మార్మోగిపోయింది. పోరాట ధీశాలి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం చాకలి ఐలమ్మ నృత్య రూపకం ప్రదర్శించి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆద్యంతం నృత్య రూపకం తిలకించి అభినందించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ప్రధాన మంత్రులు గా ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు భూ సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు. భూమి పేదల ఆత్మ గౌరవం అని, పేదల జీవన ఆధారమని, ఐలమ్మ స్ఫూర్తి తో ధరణి ని కట్టుదిట్టంగా అమల్లోకి తెచ్చి పేదల భూములు కాపాడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ "వీర్లపల్లి శంకర్" ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నేతలు వి. హనుమంతరావు, ఎ.కోదండ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా సుమన్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, సాంస్కృతిక సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, డా.కంచె ఐలయ్య, ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత తదితరులు అలేఖ్య పుంజాల బృందాన్ని అభినందించారు. తెలంగాణ ముద్దు బిడ్డ చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు. ఈ తరానికి రానున్న తరానికి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసేందుకు ఈ నృత్య రూపకం రూపొందించి ప్రదర్శించినట్లు డా. అలేఖ్య తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప శాస్త్రీయ నృత్య రూపకం అని డా. కంచె ఐలయ్య అభివర్ణించారు..


Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >