Posted on 2024-09-10 18:13:47
పాఠశాలలో అందిస్తున్న సేవలపై ప్రశంసలు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న పాకాల శంకర్ గౌడ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో మంత్రుల నుంచి పాకాల శంకర్ గౌడ్ అవార్డు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను కలువగా, టీచర్ ను కలెక్టర్ సన్మానించి, ఆయన విద్యార్థులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
సైన్స్ పై ప్రయోగాలు..
సైన్సు ఉపాధ్యాయుడుగా ప్రయోగాలు విద్యార్థులతో చేపిస్తూ సైన్స్ ఎగ్జిబిషన్లో, ఇన్స్పైర్ అవార్డులలో, అటల్ టింకరింగ్ లాబ్ నిర్వాహనలో అత్యున్నత ప్రతిభ కనబరిచారు. తను గైడ్ టీచర్ గా తయారు చేసిన పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ 2022-23 సంవత్సరానికి ఇన్స్పైర్ మానాక్ జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికై పలువురు మనల్ని పొందింది.ఈ నెలలో డిల్లీ ప్రదర్శనలో పాల్గొననుంది. గతంలో మూడు సార్లు ఇన్స్పైర్ మానక్ రాష్ట్ర స్థాయికి ,JNMSS సైన్స్ ఎగ్జిబిషన్ లో రెండు సార్లు రాష్ట్ర స్థాయికి తను గైడ్ టీచర్ గా ప్రాజెక్ట్ లు ఎంపిక అయ్యాయి. విద్యార్థి పరిపూర్ణుడుగా రూపొందాలంటే అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఉద్దేశంతో సహా పాఠ్య కార్యక్రమాలు, బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ప్రశంసలందుకున్నారు. టీచర్ శంకర్ గౌడ్ ను పలువురు అభినందించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >