Posted on 2024-09-10 11:36:25
షాద్ నగర్ లో ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు
షాద్ నగర్ రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి, తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" కొనియాడారు. వీర వనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా వారికి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మండలం పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు విట్యాల పెంటయ్య, గౌరవాధ్యక్షులు నందిగామ రామచందర్, తాలూకా ప్రధాన కార్యదర్శి లింగారెడ్డిగూడెం అశోక్ ల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. స్ధానిక రజక సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మెరిసే విప్లవ ధ్రువతార.. దొరల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ అని అన్నారు. సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైందనీ, తొలి భూపోరాటానికి నాంది పలికి, దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించిందనీ, ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందనీ ఈమెల వీర్లపల్లి శంకర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు విట్యాల పెంటయ్య, గౌరవ అధ్యక్షులు నందిగామ రామచందర్ తాలూకా ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి గూడ అశోక్, సెక్రెటరీ నందిగామ శేఖర్, చించోడు అనంతం, జంగం మల్లేష్, తీగపూర్ ఆంజనే, మాణిక్యం, అక్కిగారి శ్రీధర్,బుడంపాడు నర్సింలు, శివ, జుట్టు బాలరాజ్, రామస్వామి, దేవగిరి రామకృష్ణ, దేవగిరి అశోక్, సున్నం రాజు, కిట్టు, యాదయ్య, శేఖర్, శీను, నందిగామ మల్లేష్, మిల్ట్రీ శీను, బొగ్గుల అంజయ్య, నందిగామ మల్లేష్, మరియు రజక సంఘ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, అన్వర్, జగదీశప్ప, వీరేశం, కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, కేకే కృష్ణ, స్వరూప, రాజు, ఆగిరి రవికుమార్ గుప్తా, పురుషోత్తం రెడ్డి, మురళీ మోహన్ అప్పి, భాస్కర్, కొత్తపేట ఉస్మాన్, మనీష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >