| Daily భారత్
Logo




బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలి

News

Posted on 2024-09-08 10:58:06

Share: Share


బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలి

లక్ష్మీ నగర్ బాధితుల నిరసన

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీజాపూర్ రహదారి విస్తరణలో భాగంగా చేవెళ్లలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని లక్ష్మీ నగర్ కాలనీ బాధితులు డిమాండ్ చేశారు. 2018లో భూసేకరణ కోసం  నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని వారు వాపోయారు. ప్లాట్లు కోల్పోతున్న బాధితులంతా ఆదివారం కాలనీలో సమావేశమయ్యారు. కొన్ని నెలలుగా అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం జరగడం లేదన్నారు. పైసా పైసా కూడా పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశామని.. ప్రభుత్వ పరిహారం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని ప్లాట్లు కోల్పోతున్న బాధితులు రాజశేఖర్ రెడ్డి, బసవరాజ్, సందీప్ కుమార్, కిరణ్, ప్రతాప్ రెడ్డి, సతీష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అమృత, శ్రీదేవి,  నజీర సుల్తానా, షా ఫర్హాన్, సయ్యద్ జిశాన్ ముస్తఫా, సుదర్శన్ రెడ్డి తదితరులు కోరారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >