Posted on 2024-09-08 10:56:58
మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఈ ప్రపంచానికి మార్గదర్శకులు గురువులేనని, గురువు లేనిదే సమాజంలో రాణించలేమని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో షాద్ నగర్ రెడ్డి మహిళా సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, అంగన్ వాడిలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ జడ్పీటిసి విశాల్ శ్రవణ్ రెడ్డి, వెంకట్ రాం రెడ్డి, ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్ర్తవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది ఎదిగిన వారు ఉన్నారని గుర్తు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. మిగితా టీచర్లు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. సామాజిక రుగ్మతలను పారద్రోల విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ అధ్యక్షురాలు అరుంధతి,రెడ్డి యువజన సంఘం అధ్యక్షుడు ఆశన్నగరి మధుకర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పి వెంకట రామిరెడ్డి, రవీందర్ రెడ్డి,సురేష్ రెడ్డి, దామోదర రెడ్డి లక్మి రెడ్డి, ఉమ రెడ్డి, మంజుల రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >