| Daily భారత్
Logo




తమిళనాడు సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు.

News

Posted on 2024-09-08 09:33:02

Share: Share


తమిళనాడు సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు.

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తమిళ నటుడు విజయ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్‌ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది.ఈ మేరకు తమిళగ వెట్రి కళగం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళగ వెట్రి కళగం పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపుపై ఆ పార్టీ అధినేత విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ రాజకీయ పార్టీ చట్టపరమైన నమోదు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నామని.. అయితే ఇప్పుడు ఈసీ నుంచి గుర్తింపు లభించిందని చెప్పారు. అయితే రాజకీయ పార్టీ గుర్తింపు కోసం తమిళగ వెట్రి కళగం ఈసీకి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దరఖాస్తు చేయగా.. దాదాపు 7 నెలల తర్వాత గుర్తింపు లభించింది.

'తమిళగ వెట్రి కజగంను రాజకీయ పార్టీగా నమోదు చేయాలని మేము గత ఫిబ్రవరి 2వ తేదీన భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాము. మన దేశ ఎన్నికల సంఘం దీనిని చట్టబద్ధంగా పరిగణించి ఇప్పుడు మన పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసి, రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాలలో పాల్గొనేందుకుఅనుమతించింది. దీన్ని మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని విజయ్ చెప్పారు. 

దీంతో తమకు మొదటి తలుపు తెరుచుకుందని విజయ్ అన్నారు. తమ పార్టీ మొదటి రాష్ట్ర స్థాయి సమావేశానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని విజయ్ తెలిపారు. 

ఇక, విజయ్ గత నెలలో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం జెండాను, గుర్తును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. విజయ్ పనైయూర్‌లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసి.. తన పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు. రెండు రంగులు మెరూన్, పసుపుతో కూడిన జెండాలో రెండు వైపులా ఏనుగులు, మధ్యలో దిరిసెన పువ్వు గుర్తును ఉంచారు.

Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >