| Daily భారత్
Logo




ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : యూత్ కాంగ్రెస్ జూలూరుపాడు మండల అభ్యర్థి రామిశెట్టి నరేందర్

News

Posted on 2024-09-08 11:21:11

Share: Share


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : యూత్ కాంగ్రెస్ జూలూరుపాడు మండల అభ్యర్థి రామిశెట్టి నరేందర్

జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :  యూత్ కాంగ్రెస్ జూలూరుపాడు మండల అభ్యర్థి రామిశెట్టి నరేందర్ 

భారీ వర్షాలు ఉన్నాయి

డైలీ భారత్, జూలూరుపాడు: రాబోయే రోజుల్లో జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ అభ్యర్థి రామిశెట్టి నరేందర్ ఒక ప్రకటనను విడుదల చేశారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు.వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, నదులు, చెరువుల వద్దకు చూడటానికి వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని తెలిపారు.వర్షాలు తగ్గే వరకు వ్యవసాయ పనులకు మరియు పశువులు కాయడానికి వెళ్లకుండా ఉండాలని సూచించారు.ఇతర శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసు శాఖ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా వాగులు మరియు నదులలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ఎవరికైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను పొందాలని తెలియజేసారు..

Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >