Posted on 2023-11-01 18:19:21
సైబర్ నేరాలు, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాలమేరకు సైబర్ నేరాలు పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
సైబర్ జాగౄక్త దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా సైబర్ సెల్ డిఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మరియు అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో సైబర్ క్రైమ్ మీద విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించి , సైబర్ నేరాలను నివారించడమే జిల్లా పోలీసుల లక్ష్యంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ క్రైంపై అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర పోలీస్ ఆద్వర్యంలో సైబర్ జాగౄక్త దివస్ అనే కార్యక్రమం ద్వారా సైబర్ భద్రత తో పాటు సైబర్ నేరాలపై అవగాహన , నివారణకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను పిల్లలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలి.ఈ యెక్క కార్యక్రమ0 లో నేర్చుకున్న విషయాల్ని ప్రతి ఒక్కరు మిగతా వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని అన్నారు . ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన తప్పనిసరి అన్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >