| Daily భారత్
Logo




బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-25 17:36:30

Share: Share


బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ లో అంగరంగ వైభవంగా బోనాలు

పటేల్ రోడ్డు 21 వ వార్డులో చెన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

పోచమ్మ ఆలయం, భాగ్యనగర్ కాలనీ, చటాన్ పల్లి, భగత్ సింగ్ కాలనీ, తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే శంకర్ బోనాల పర్యటన.

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో .. బెమ్మాండం బద్దలు గొట్టేయ్ రో.. సీటి గొట్టీ బయలెల్లూ .. చత్రీ బట్టీ బయలెల్లూ దంకా ఇస్తూ దత్తర్లూ .. కమ్మా ఇంచూ డల్లర్లూ అంటూ షాద్ నగర్ పట్టణంలో జోరుగా బోనాల సందడి నెలకొంది.

ఈసారి బోనాలకు ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిలిచారు. బోనాల వేడుకల్లో తనదైన శైలిలో చర్నకోల చేతపట్టి పోతురాజులతో విన్యాసాలు చేయిస్తూ తనదైన శైలిలో నృత్యం చేశారు. ఎమ్మెల్యే శంకర్ బోనాల వేడుకల్లో పోతురాజులు చేస్తున్న విన్యాసాలతో సమానంగా తగ్గేదే లేదు అంటూ వేసిన చిందులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

జోర్దార్ గా పట్టణంలో జరిగిన బోనాలకు ఎమ్మెల్యే శంకర్ ఆయన అనుచరులు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పట్టణంలోని 21 వ వార్డులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కే చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకకు శంకర్ హాజరై భక్తులతో కలిసి ఆడి పాడారు. అదేవిధంగా పోచమ్మ ఆలయం, భాగ్యనగర్ కాలనీ, చటాన్ పల్లి, భగత్ సింగ్ కాలనీలలో జరిగిన బోనాల వేడుకలకు ఎమ్మెల్యే శంకర్ హాజరై భక్తులకు ఉత్సాహం కల్పించారు.

దుష్టశక్తులను తరిమేద్దాం - ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారని  బోనాల కార్యక్రమంతో గ్రామదేవతల చల్లని ఆశీస్సులతో దుష్టశక్తులను తరిమేద్దామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. బోనాల సందడి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అను బంధాలను పెంపొందించే వారధి బోనాలు అని అన్నారు. షాద్ నగర వాసుల ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధం అని, బోనాలు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించే హిందువుల పండుగని, ఈ పండుగ ప్రధానంగా తెలంగాణలో  

జరుపుకుంటున్నామని అన్నారు. గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారనీ పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ దేవిలకి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అగ్గనూర్ విశ్వం, చెంది తిరుపతి రెడ్డి, అగ్గనూర్ బస్వo, బాబర్ ఖాన్, శ్రీనివాస్ యాదవ్, జృముద్ ఖాన్, అందే మోహన్,ఇబ్రహీం, శ్రీనివాస్, అశోక్, ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, ప్రవీణ్, శేఖర్, రాహుల్,జగదీశ్వర్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >