Posted on 2024-07-25 11:01:45
వైద్యాన్ని వ్యాపారంగా చూడవద్దు
సరైన రోగనిర్ధారణ చేయండి ప్రాణాలు కాపాడండి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పిలుపు
షాద్ నగర్ లో బి ఆర్ కే న్యూస్ గ్రూప్ ఆధ్వర్యంలో "నావి" మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మనుషులకు ఆ బ్రహ్మ ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని రక్షించేది వైద్యుడు మాత్రమే అని అలాంటి వైద్యరంగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంచుకొని పదిమంది ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన బి.ఆర్.కె న్యూస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "నావి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్" యాజమాన్యాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మనస్ఫూర్తిగా అభినందించారు. గురువారం పట్టణంలో బి ఆర్ కే న్యూస్ గ్రూప్ ఏర్పాటుచేసిన నావి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లాంచనంగా ప్రారంభించారు. బి ఆర్ కె న్యూస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియా ప్రతినిధులు తదితరులు కలసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేదమంత్రాల నడుమ ఆసుపత్రిని ఎమ్మెల్యే శంకర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ను ఆసుపత్రి యాజమాన్యం బి ఆర్ కే గ్రూప్ చైర్మన్
బొల్లా శివరామకృష్ణ, డైరెక్టర్ పృథ్వీ కుమార్ స్థానిక ఎమ్మెల్యే శంకర్, స్ధానిక మీడియా ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు అంటే ప్రజలు జంకుతున్నారని తెలిపారు. ఆసుపత్రికి ఎవరైనా అనారోగ్యంతో వస్తే వారిని కొన్ని ఆసుపత్రులు భయపెట్టి చంపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ధనార్జన కోసమే ఆసుపత్రులను నడుపుతున్నారని విమర్శలు వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణం పట్టదని ఉన్నోడికి లేనోడికి ఒకే తీరు వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. ముందుగా ఆసుపత్రికి పేషెంట్ వస్తే అతడి వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఎంత వైద్యం చేసుకోగలడు? అనే ఆర్థిక కోణంలో చూస్తున్నారే తప్ప ముందు అతని ప్రాణానికి ఒక భరోసా ఇవ్వడంలో ప్రైవేటు ఆసుపత్రులు విఫలం అవుతున్నాయని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం మెరుగైన ఆర్థిక స్తోమత ఉన్న వారికి మాత్రమే దక్కుతుందనే విమర్శలు ఉన్నాయని అన్నారు. బి ఆర్ కే న్యూస్ గ్రూప్ ద్వారా ఏర్పాటుచేసిన నావి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు నిష్పక్షపాతంగా ఉండాలని రోగుల రోగనిర్ధారణ సరిగ్గా చేసి వారికి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. తన బంధువులకు కూడా ప్రైవేట్ ఆసుపత్రి ఉందని అయితే కనీస విలువలు పాటించి ధర్మంగా ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వాలని తాను వారికి సూచించినట్టు చెప్పారు. ముందుగా రోగికీ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అవన్నీ వదిలేసి కేవలం ఆర్థికంగా వ్యాపారంతో చికిత్స చేయడం భావ్యం కాదని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ చెట్ల పావని, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, స్థానిక మీడియా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆహ్వానితులను పూల బొకే శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ కె స్ధానిక జర్నలిస్ట్ చందు, ఎండి ఖాదర్ గోరి, అందె మోహన్, సుదర్శన్ గౌడ్, మాజీ ఎంపిటిసి కొమ్ము కృష్ణ, లింగారెడ్డి గూడా అశోక్ తదితరులు పాల్గొన్నారు..
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >