Posted on 2024-07-24 12:57:58
తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ ప్రస్థానం గొప్పది
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు సుపరిచితులు కేటీఆర్ అని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో తనదైన ముద్రను వేసిన యువనేత యువతకు మార్గదర్శకుడు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అభినందించారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఆయనను హైదరాబాద్ లో ప్రత్యేకంగా కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పూల బొకేతో ఆయనను గౌరవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
ఒకవైపు పార్టీని నడిపించే బాధ్యత భుజాన వేసుకొని.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో తీసుకొని రావడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. తండ్రి కేసీఆర్ కు తగ్గ తనయుడు కేటీఆర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాల నుంచి సొంత రాష్ట్రానికి వచ్చి అప్పటి నుంచి ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అహర్నిశలు రాష్ట్రం కోసం సేవలు అందించాలని గుర్తు చేశారు. చాలా మంది కేటీఆర్ మంత్రిగా తెలంగాణకు చేసిన సేవను మాత్రం పొగడకుండా ఉండలేరని ఐటీ అంటే కేటీఆర్ అనేలా ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారని గత సేవల జ్ఞాపకాలను ఆయన నెంబర్ వేసుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా కలుసుకొని శుభాకాంక్షలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిదీ విభిన్నశైలని వారి ఆలోచనా ధోరణి కూడా వేర్వేరుగా ఉంటుందని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరూ ఒకటే లక్ష్యంగా ముందుకు సాగారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం, రాజకీయాల్లో ఎదురులేని పటిష్టత కోసం కేసీఆర్ పని చేశారని రాజకీయ శత్రువులను బలహీన పరుస్తూ.. పార్టీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చారనీ అదే సమయంలో కేటీఆర్ మాత్రం రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల కోసం, యువత ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం ముందుకు సాగారని టిఆర్ఎస్ పాలన గురించి కొనియాడారు..
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >