Posted on 2024-07-24 09:03:04
ఎన్ పి ఆర్ డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి.
షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: వికలాంగులను కించపరిచే విదంగా పోస్ట్ పెట్టిన ఐఏఎస్ స్మిత సభర్వాల్ పై చర్య తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై శరత్ కుమార్ కు ఐపీఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్అధికారి శ్రీ మతి స్మిత సభర్వాల్ వికలాంగులను కించపరిచే విదంగా జులై 21నాడు ట్విట్టర్ లో అంధుడిని కారు డ్రైవరుగా నియమిస్తామా? వైకల్యం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకుంటామా?' అని పోస్ట్ పెట్టినారు. దీంతో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఆమె పెట్టిన పోస్ట్ ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం మరియు 2016 RPWD చట్టంలో పేర్కొన్న సమానత్వం మరియు వికలాంగుల పట్ల వివక్షతకు పూర్తి భిన్నమైంది.వికలాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానించారు. వికలాంగులను అగౌరవపరిచెందుకు ప్రయత్నం చేశారు.2016 RPWD చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కొరకు ప్రత్యేకంగా వైకాల్యాన్ని బట్టి రిజర్వ్ పోస్టులు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టంగా ఉంది.
2016 RPWD చట్టం సెక్షన్ 92(A),(B),(E) కేసు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >