| Daily భారత్
Logo




ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

News

Posted on 2024-07-23 13:54:18

Share: Share


ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

డైలీ భారత్, హనుమకొండ: ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు  మెరుగైన వైద్య సేవలను వైద్యులు సిబ్బంది అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య  ఆదేశించారు.

మంగళవారం హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషంట్, ఔట్ పేషంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల  గదులతోపాటు  ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలకు సంబంధించిన  పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని  కలెక్టర్ ఆరా తీశారు. ఏవైనా  సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమీకృత సలహా పరీక్ష(ఐసీటీసీ) కేంద్రాన్ని, అదేవిధంగా ఆసుపత్రిలోని హెచ్ఐవి టెస్ట్  సెంటర్ను  కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని  ఐపి, ఓపీ సంఖ్యను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలు నవజాత శిశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను అందించాలన్నారు. ఆసుపత్రిలో ఏవైన ఇబ్బందులు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించే వివిధ జబ్బులకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు ఆటోమెటిక్ గా జనరేటర్ లు పనిచేసేటట్టు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >