| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం..

ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం..

డైలీ భారత్, తెలంగాణ న్యూస్: ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం..

►రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదు

►ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు

►మీ కలలు సాకారం అవుతాయని నమ్మి బీఆర్‌ఎస్‌కి ఓటేశారు

►పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని.. భవిష్యత్తు మారుతాయని అనుకున్నారు

►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది

►తెలంగాణ కలను బీఆర్‌ఎస్‌ నాశనం చేసింది

►తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం జరగలేదు

►మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది

►సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ సిద్ధాంతం

►కాంగ్రెస్‌ హయాంలోనే ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయి

►తెలంగాణ కోసం కాంగ్రెస్‌ రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది

►తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోనియాగాంధీకి తెలుసు

►అయినా సోనియా గాంధీ మీ కోసం నిర్ణయం తీసుకున్నారు

►దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు

►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు


దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు

►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు

►మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే నిర్ణయం తీసుకున్నారు

►తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు

► లక్ష ఉద్యోగాల్ని కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది

►నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు

►కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

►తెలంగాణలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది

►వరి రూ. 2,500, మొక్కజొన్నకు రూ.2,200 మద్దతు ధర ఇస్తాం

►రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం

► ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం

►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారి కుటుంబానికే ప్రాధాన్యత దక్కింది

►అమరులను కాంగ్రెస్‌ గౌరవిస్తుంది.. శ్రీకాంత్‌ చారికి నా నివాళి

►బీఆర్‌ఎస్‌ కేబినెట్‌లో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు

►గల్ఫ్‌ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం

►ఆదివాసీల హక్కుల్ని బీఆర్‌ఎస్‌ పెద్దలు లాక్కుంటున్నారు

►మీ భూముల నుంచి మిమ్మల్ని వెళ్లగొడుతున్నారు

►మీకు రావాల్సిన డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను మళ్లిస్తున్నారు

►ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గిరిజనులకు ఇళ్లు

►గత కాంగ్రెస్‌ ప్రభుత్వం మీకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది

►18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఇస్తాం

►ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భర్తీపై దృష్టి పెట్టలేదు

►రకరకాల మాఫియాలను ప్రొత్సహించింది

►మీ కోసం ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ తెచ్చింది

►గ్యారెంటీలు ఇస్తామన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం

Previous భారీ చేరికలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖరావం
Next అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
ADVERTISEMENT