| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారీ చేరికలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖరావం

భారీ చేరికలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖరావం

- గద్వాల నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి 1000 మంది చేరిక....

- గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ సమక్షంలో...

డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గ పరిధిలోని ధరూర్ మండలం సోంపురం, ర్యాలంపాడు,రేవులపల్లి (డ్యాం), కేటిదొడ్డి మండలం కోండపురం,మైలగడ్డ,గువ్వలదిన్నె తూర్పు తాండ,పాగుంట,మల్దకల్ మండలం కుర్తిర్వాల్ చెరువు,బుర్దిపాడు,గట్టు మండల బోయలగుడ్డెం, చాగదొణ,గద్వాల మండలం తెలుగోనిపల్లి,లత్తిపురం గ్రామాల నుంచి పెద్దఎత్తున బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచులు, వివిధ స్థాయిల తాజా మాజీ నాయకులు గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సమక్షంలో 1000 జెడ్పి చైర్ పర్సన్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు... చేరిన వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి అభ్యర్థి ఆహ్వానించారు...

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు 10 సంవత్సరాల అధికారం ప్రజలు ఇస్తే ప్రజలకు ఇచ్చిన హామీ లను అందని ద్రాక్షగా మారిందన్నారు..నేను అధికార పార్టీలో ఉండి ప్రజలకు అభివృద్ధి చేయాలేననే కాంగ్రెస్ పార్టీలో చేరి గద్వాల నియోజకవర్గ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల బిడ్డగా అవకాశం వచ్చినందుకు వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున చేరిక అవుతున్న ప్రజలందరి మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొంది..వెనుకబడిన వర్గాల ప్రజలకు సేవా చేసుకుంటాన్నాని,కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సరితమ్మ కోరారు....

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్ రెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి,మాచర్ల వెంకటస్వామి గౌడ్, గౌస్, శ్రీనివాస్ గౌడ్, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, అల్వాల రాజశేఖరరెడ్డి, కృష్ణమూర్తి,సోమశేఖర్ రెడ్డి,తిమ్మరెడ్డి,మహానంది రెడ్డి,పద్మరెడ్డి, నందిన్నె ఆంజనేయులు తదితరులు ఉన్నారు

Previous దసరా కానుక ప్రకటించిన ప్రభుత్వం : ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు
Next ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం..
ADVERTISEMENT