డైలీ భారత్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక ప్రకటించింది. 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఇస్తున్న డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
News