| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

20.5 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనా స్వాధీనం

నాలుగు జిల్లాల్లో ఏడు కేసులు నమోదు

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల :వరస దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుదవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  దొంగల వివరాలు వెల్లడించారు. రామటంకి సారయ్య అలియాస్ వెంకటేష్, భూతం రాములు ఎ1, ఎ2 లుగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 12 లక్షల విలువ గల 20.5 తులాల బంగారు ఆభరణాలు, 43 తులాల వెండి అబరణాలు,రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోగా, దొంగతనం చేయుటకు వాడే పరికరాలు ఐరన్ రాడ్, కట్టర్ , స్క్రూ డ్రైవర్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ వరుస దొంగతనాల్లో పాల్పడిన దొంగలపై వివిధ జిల్లాల్లో కేసులు నమోదయాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. సారయ్య అలియాస్,  వెంకటేష్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి  గత సుమారుగా 10 సంవత్సరాల నుండి  దొంగతనాలు చేస్తూన్నాడని, గతంలో జైలు శిక్ష అనుభవించాడన్నారు. అంతే కాకుండా 2012 నుండి 2016 సంవత్సరం వరకు పలు చోట్లలో దొంగతనాలు పాల్పడినందుకు 2017 వ సంవత్సరంలో పీడీ యాక్ట్ పెట్టి  జైలుకు పంపించారను తెలిపారు. జిల్లాలోని చందుర్తి మండలంలో గోస్కులపల్లి, మల్యాల , ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, కన్నూరు ,పెద్దపెల్లి జిల్లా పోతన కాలనీ ఒకే రోజు దొంగతనాలు చేసిన క్రమంలో మూడపెళ్లి గ్రామానికి చెందిన మల్యాల హన్మండ్లు, రాజయ్య లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందుర్తి సిఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి  దర్యాప్తులో భాగంగా ఈనెల 16 రోజున చందుర్తి సిఐ కిరణ్ కుమార్ వేములవాడలోని నంది కమాన్ వద్ద సంచరిస్తున్నారని వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను ఎస్సై అశోక్ తన సిబ్బంది చాకచక్యంగా పట్టుకొని విచారించగా నిందితులు తాము చేసిన దొంగతనాలు ఒప్పుకోవడంతో రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ దొంగలను పట్టుకొనుటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన డిఎస్పీ నాగేంద్రచారి, చందుర్తి సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐ సిరిసిల్ల అశోక్, కానిస్టేబుల్స్ సతీష్  ప్రమోద్,లను   జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  అభినందించారు.

గ్రామాల్లో పట్టణలాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనపడితే పోలీస్ వారికి సమాచారం అందించాలని, గుర్తు తెలియని వ్యక్తులకు రూమ్ లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి యెక్క పూర్తి సమాచారం తెలుసుకోన్నా తరువాతే వారికి రూమ్ లు అద్దెకు ఇవ్వాలని, నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ప్రతి ఒక్కరు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

Previous ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం..
Next నేడు భారత్ తో బంగ్లాదేశ్ డీ
ADVERTISEMENT