| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్ : కేటీఆర్

బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్ : కేటీఆర్

బలహీన వర్గాల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించుకుందాం

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని కేటీఆర్ అన్నారు.చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతు

మోడీకి, ఎన్డీఏ కూటమికి 400 కాదు..200 ల సీట్లు కూడా వచ్చేలా లేవు.కాంగ్రెస్ పార్టీ కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్ఎస్ కు మంచి సీట్లు రావాలె. 

బీఆర్ఎస్ కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మనం చెప్పినట్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వింటది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి బుద్ధి చెప్పాలి.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్. 

.బలహీనవర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలి. చెేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి సారిగా బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు.అందరం కలిసి కాసాని అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలే. రైతుల దగ్గరకు వెళ్లి రూ. 2 లక్షల హామీ నెరవేరిందా అడగాలె.  

మీరంతా బహుబలి సినిమా చూశారా? అందులో రెండు పార్ట్ లు ఉన్నట్లే. రేవంత్ రెడ్డి మోసం పార్ట్-1 అయిపోతుంది. మోసం పార్ట్-2 సీక్వెల్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి మోసపోయింది చాలాదా? ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి మోసం పోతే నమ్మిన వాళ్లది తప్పు. కేసీఆర్ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు...100 రోజుల అబద్దాల పాలన ఒక వైపు. 

రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎంతో మంచి చేసిండు. 

చేవెళ్లలో బ్రహ్మండమైన  అభివృద్ధి చేసుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం. 111 జీవోను కూడా ఎత్తివేసింది కేసీఆర్ మాత్రమే అన్నది గుర్తు చేసుకోవాలి. బీజేపీ పదేళ్లలో ఏమీ చేశారో చెప్పి ఓటు అడుగుమంటే చెప్పేందుకు ఒక్కటి లేదు. మోడీ తెలంగాణకు ఒక్క కాలేజ్ పెట్టినవా, స్కూల్ ఇచ్చినవా, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఏమీ ఇచ్చినవ్. రాముడితోని మనకు పంచాయితీ లేదు. రాముడు అందరివాడు. 

మతం పేరుతో విద్వేషాలు నింపి ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి. ఆడబిడ్డలు.ఆలోచించాలె. మోడీ సిలిండర్ ధరను ఎంత పెంచిండో గుర్తు చేసుకోవాలి.క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్, డిజీల్ ధరలు పెంచిన్రు. 

70 రూపాయల పెట్రోల్ ను 110 చేసినందుకా? డిజీల్ రేట్లు పెంచినందుకా? సిలిండర్ రేట్లు పెంచినందుకా? పప్పు, ఉప్పులు ఫిరం చేసినందుకా? ధరలు పెంచినందుకా ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి?.బండి సంజయ్ మాత్రం మోడీ దేవుడు అంటాడు. ఆయన దేనికి దేవుడో చెప్పుమంటే చెప్పడు.

రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే బీజేపీకి కచ్చితంగా మన బుద్ధి చెప్పాలి. ఈ ప్రాంతానికి బీజేపీ ఏం చేసిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటు అడుగుతాడు. 

కృష్ణానీళ్లలో వాటా తేల్చుమంటే పదేళ్లుగా దాన్ని తేల్చలేదు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వని పార్టీ అంటే బీజేపీయే. 

బీజేపీని అడ్డుకునేది ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. ఈటల, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపురావును ఓడించిందెవరు. కిషన్ రెడ్డిని పోటీ చేసేందుకే భయపడేలా చేసిందే బీఆర్ఎస్ అన్న విషయం గుర్తుంచుకోవాలె. 

రంజిత్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరిన వెంటనే చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. తెలంగాణ ప్రజలు మంచోళ్లు. అమ్మలాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెప్తారు.   

 బలహీన వర్గాల అభ్యర్థి కాసాని గెలిపించుకుందాం. 

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు 8-10 సీట్లు మనమే అభివృద్ధి విషయంలో కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చు.

Previous హిందూ వాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
Next పిఠాపురంఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
ADVERTISEMENT