| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హిందూ వాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

హిందూ వాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ అంబా భవాని టెంపుల్ నుండి హిందూ బంధువుల అందరూ కలిసి బైక్ ర్యాలీ చేశారు. ఇట్టి బైక్ ర్యాలీ నెహ్రూ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి బయలుదేరి కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌక్ వెంకటేశ్వర టెంపుల్ పెద్ద బజార్ హనుమాన్ టెంపుల్ నుండి పాత బస్స్టాండ్ సర్దార్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ముగిసింది.

ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కొండి  సురేందర్ బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ కరీంనగర్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు  రవీందర్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్ ఎనగంటి నరేష్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం ఉరకొండ రాజ దుమాల శ్రీకాంత్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు  సుంకరి బాలకిషన్ ఇంజాపూరి  మురళి మహేశుని అనిల్ భారతీయ జనతా పార్టీ నాయకులు బూత్ అధ్యక్షులు బూతు కార్యకర్తలు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు.



Previous "పాఠశాల విద్య గాడిన పడేనా"?
Next బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్ : కేటీఆర్
ADVERTISEMENT