డైలీ భారత్, శ్రీకాళహస్తి: నేడు వచ్చినటువంటి పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలని సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.
సోమవారం ఆయన శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడుతూ మార్కులు ర్యాంకులు జీవితం కాదని, ఈ సమయంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని, లేదంటే విద్యార్థులు డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకునే ఆలోచనతో ఉంటారని ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు, పసి హృదయాల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన అన్నారు.