| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజల పక్షాన కొట్లాడుదాం.. బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్

ప్రజల పక్షాన కొట్లాడుదాం.. బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్

సమిష్టిగా కృషి చేస్తే కరీంనగర్ పార్లమెంట్ మనదే

కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో నమ్మకం పోయింది 

బండి సంజయ్ పై వ్యతిరేకత ఉంది 

ప్రచారంలో ఆర్భాటాలకు దూరంగా ఉండాలి 

ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్, బీజేపీలు చేసిన మోసాలపై చర్చించండి 

మే 10న సిరిసిల్లలో  కేసీఆర్ రోడ్ షో 

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ 

- ⁠సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి కార్యకర్తలతో సమావేశం 

- పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం 

డైలీ భారత్, తెలంగాణ: ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ  పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సోమవారం సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు తీసేస్తాం అంటున్నరు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ మోసపు హామీలను  ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.

ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ కు  చేసిందేమీ లేదు. ఐదేళ్లలో ఒక్క పాఠశాల, ఒక్క కళాశాల తీసుకొచ్చాడా ? ఒక్క గుడి కట్టాడా ? ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చార. ఒక్క రూపాయి పని చేయని బండి సంజయ్ కు ఓట్లు అడిగే అర్హత లేదు. మోడీ పదేండ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. తెలంగాణకు ఏమి చేయని బిజెపి కి, కరీంనగర్ కు నయాపైసా పని చేయని బండి సంజయ్ కు ఓటు ఎందుకు వేయాలో ప్రజల్లో చర్చ పెట్టాలి.

రాష్ట్రంలో 8 నుంచి  10స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు వలన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 10న కేసీఆర్ రోడ్ షో సిరిసిల్లలో ఉంటుంది. ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చేయాలి. 

కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారు. కష్ట కాలంలో నా వెంట నిలిచిన మీకు నేను అండగా ఉంటాను. భవిష్యత్తు లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గెలుపు కోసం కష్టపడ్తాను. కాంగ్రెస్ నాయకులు  బీఆర్ఎస్ నాయకులపై  పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు, కాంగ్రెస్ లో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడాడ్డు అందరికి అండగా ఉంటాను.

Previous 14 ఏళ్ల బాలిక గర్భ విచ్చిత్తికి సుప్రీంకోర్టు అనుమతి
Next విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులు అండగా నిలవాలి : సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య
ADVERTISEMENT