| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

14 ఏళ్ల బాలిక గర్భ విచ్చిత్తికి సుప్రీంకోర్టు అనుమతి

14 ఏళ్ల బాలిక గర్భ విచ్చిత్తికి సుప్రీంకోర్టు అనుమతి

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక కు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది.

దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతించింది. దీనిని ‘అసాధారణ’ కేసుగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం , విస్తృత అధికారాలను ఉపయోగిం చుకుని తీర్పు వెలువరిం చింది.

మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చింది. కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయిం చింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగిం చేందుకు అనుమతించా లని ఈనెల ఆరంభంలో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గర్భవిచ్ఛిత్తికి నిరాకరించింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ఉందని, ఇప్పుడు విచ్ఛిత్తి చేస్తే పూర్తిగా రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశముందని అభిప్రా యపడింది.

ఈమేరకు బాలిక తల్లి పిటి షన్‌ను ఏప్రిల్ 4న కొట్టేసిం ది. ఈ తీర్పుపై బాధితురాలి తల్లి సుప్రీం కోర్టును ఆశ్ర యించింది. దీనిపై గతవా రం విచారణ జరిపిన న్యాయస్థానం , ముంబై లోని సియాన్ ఆస్పత్రి మెడికల్ బోర్డును నివేదిక కోరింది.

గర్భవిచ్ఛిత్తిపై తీసుకునే నిర్ణయం వల్ల బాలిక శారీ రక, మానసిక పరిస్థితి ఎలా ఉండనుందో చెప్పాలని సూచించింది. దీనిపై మెడి కల్ బోర్డు న్యాయ స్థానానికి నివేదిక సమర్పించింది.

ఈ సమయంలో గర్భవి చ్ఛిత్తితో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ , కాన్పు తర్వా త ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదు.. ఈ గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలికపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది” అని నివేదికలో పేర్కొంది.

దీన్ని పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవి చ్ఛిత్తికి అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందిం చేందుకు రాజ్యాంగం లోని ఆర్టికల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాలలో ఈ తీర్పు వెలువరిస్తున్నట్టు తెలిపింది.

ఆ బాలికకు తక్షణమే వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేయా లని సియాన్ ఆస్పత్రి డీన్‌ ను ఆదేశించింది. సాధార ణంగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రిగ్నెన్సీ చట్టం ప్రకారం వివాహిత మహిళలు ప్రత్యే క అవసరాలున్న వారు , అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భా న్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకు నేందుకు అనుమతి ఉంది. ఆ సమయం దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి...

Previous 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు
Next ప్రజల పక్షాన కొట్లాడుదాం.. బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
ADVERTISEMENT