| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

సిరిసిల్ల పట్టణంలోని స్వయంభుగా వెలసిన ఏకైక రామాలయం

డైలీ భారత్ సిరిసిల్ల :సిరిసిల్ల పట్టణం హెడ్ పోస్ట్ ఆఫీస్ వీధిలోని శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలోని స్వయంభుగా వెలసిన ఏకైక రామాలయం కావడంతో భక్తులు వేల సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటుంటారు. సుమారు 65 నుండి 70 సంవత్సరముల క్రితం ఇరుకుల్లా వంశీకుల ఇంటి పూజారి అయినటువంటి విజయవాడకు చెందిన గాయత్రీ పంతులు, తన కలలో శ్రీరాములవారు వచ్చారని తన విగ్రహాలు బంజరు దొడ్లో ఉన్నాయని ఇరుకుల్ల రాజలింగం కు తెలిపారు. దీంతో ఇరుకుల్ల రాజలింగం మరియు అతని సోదరులు ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపించగా శ్రీరామలక్ష్మణుల శిలా విగ్రహాలు బయటపడినాయి. బంజరు దొడ్డి పక్కనే ఇరుకుల్ల వారి ఇంటి మూల పై అప్పటికే వందల సంవత్సరాల నుండి హనుమాన్ జండా ఎగురుతూ ఉండేది. ప్రతి దసరా రోజున భాజా భజంత్రీల మధ్యన పెద్ద ఎత్తున గ్రామస్తులు అక్కడికి చేరుకొని నూతన హనుమాన్ జెండాను ఆవిష్కరించి వేడుకను జరుపుకునేవారు. ఆ జెండా వద్దనే ఇట్టి విగ్రహాల ప్రతిష్ట చేశారు. నాటినుండి స్వామి వారు నిత్యం పూజలు అందుకుంటున్నారు. అయితే గత 25 సంవత్సరముల క్రితం ఆ జెండా పురాతనం కావడంతో వీధిలోని వారంతా కూర్చొని చర్చించుకుని జెండాను తొలగించి అదే స్థలంలో నూతన ఆలయంను నిర్మించారు. నాటి నుండి దసరా రోజు జరిగే ఉత్సవానికి బదులుగా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జరిగే ఇట్టి కళ్యాణ మహోత్సవానికి దాతలు భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇస్తుంటారు వేల సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటుంటారు. భక్తులు ఎన్ని వేల మంది వచ్చినా అందరికీ తగిన ఏర్పాట్లు కలిగించడం, వచ్చిన ప్రతి భక్తునికి అన్న ప్రసాద వితరణ జరిపించడం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోకల వేణు ఆధ్వర్యంలోని రామాలయం ట్రస్ట్ చూసుకుంటుంది.

Previous ఏసీబీ వలలో సివిల్ సప్లయిస్ డిటి
Next కడప సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడుగా మస్తాన్
ADVERTISEMENT