| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఆదుకోవాలి : వస్త్ర పరిశ్రమ సంఘాల ఐక్యవేదిక జేఏసీ

వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఆదుకోవాలి : వస్త్ర పరిశ్రమ సంఘాల ఐక్యవేదిక జేఏసీ

నేతన్న గర్జన సభ విజయవంతం                     - సిరిసిల్ల ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉంది                    ప్రభుత్వం ఆదుకోవాలి

వస్త్ర పరిశ్రమ సంఘాల ఐక్యవేదిక జేఏసీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఆదుకోవాలని కోరుతూ పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ లో నేతన్న గర్జన సభను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నేత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని నేత కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని దుర్భర పరిస్థితులు సిరిసిల్ల నేత కార్మికులు అనుభవిస్తున్నారని, నేత కార్మికుల ఆత్మహత్యలతో మళ్ళీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉందని వెంటనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఆదుకొని బతుకమ్మ  చీరల ఆర్డర్లను ఇప్పించి, బకాయి ఉన్న బిల్లులను విడుదల చేయాలని వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని లేనిచో త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన నేత కార్మికునికి నివాళులర్పించి మౌనం పాటించారు.


ఈ సభలో సిరిసిల్ల పట్టణములోని నేత కార్మికులు నేత కార్మిక కుటుంబాలు,ఆసాములు, యజమానులు పాల్గొన్నారు..

Previous బాధిత కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ - బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Next గన్‌ మిస్‌ ఫైర్‌.. ఆర్‌,ఎస్‌ఐ అనుమానాస్పద మృతి
ADVERTISEMENT