| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుక్క‌ల దాడిలో నాలుగేండ్ల బాలిక మృతి

కుక్క‌ల దాడిలో నాలుగేండ్ల బాలిక మృతి

డైలీ భారత్, నిర్మ‌ల్:నిర్మ‌ల్ జిల్లాలోని తాటిగూడ గ్రామంలో విషాదం నెల‌కొం ది. వీధి కుక్క‌ల దాడిలో గాయ‌ప‌డిన ఓ నాలుగేండ్ల చిన్నారి చికిత్స పొందుతూ ఈరోజు ప్రాణాలు కోల్పో యింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. తాటిగూడ గ్రామానికి చెందిన అమ‌ర్ సింగ్, స‌రిత దంప‌తుల‌కు కూతురు భూక్యా శాన్వి(4) ఉంది. అయితే మార్చి 2వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న శాన్విపై వీధి కుక్క‌లు దాడి చేశాయి.

దీంతో ఆ పాప‌కు తీవ్ర గాయాల‌య్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికి త్స పొందుతూ శుక్ర‌వారం ప్రాణాలు కోల్పోయింది

శాన్వి. దీంతో త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగి పోయారు.ఇలాంటి ఘ‌ట‌ న‌లు పున‌రావృతం కాకుం డా, కుక్క‌ల‌ను త‌రిమేసే విధంగా చ‌ర్య‌లు తీసుకోవా ల‌ని అధికారుల‌కు అమ‌ర్ సింగ్ మొర పెట్టుకున్నాడు.

పెంబి మండ‌ల ప‌రిధిలోని ప‌లు గ్రామాల్లో కుక్క‌ల దాడులు విప‌రీతంగా పెరిగి పోయాయ‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు..దీంతో పిల్ల‌లు, వృద్ధుల భ‌ద్ర‌త‌పై స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు..

Previous పార్లమెంటు ఎన్నికల బరిలో మాజీ ఐపీఎస్, ఐఏఎస్
Next ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
ADVERTISEMENT