| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లోకసభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్ శాతం పెంచాలనే సంకల్పంతో రంగోలి కార్యక్రమం ఏర్పాటు

లోకసభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్ శాతం పెంచాలనే సంకల్పంతో రంగోలి కార్యక్రమం ఏర్పాటు

డైలీ భారత్, మెదక్:రాబోయే లోకసభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్ శాతం పెంచాలనే సంకల్పం తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నేడు కలెక్టరేట్ లో స్వీప్ అధ్వర్యంలో రంగోలి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ తెలియచేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ LB రమేష్ గారు మాట్లాడుతూ మహిళలు వారి కుటుంబ సభ్యుల తో పాటు ఇరుగు పొరుగు వారందరూ తప్పకుండా ఓటు వేసేటట్లు అవగాహన చేయాలన్నారు రాబోయే లోకసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం లో జిల్లాను రాష్ట్రం లో మొదటి స్థానం పొందేటట్లు అందరూ కృషి చేయాలన్నారు మరియు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమం లో జిల్లా సైన్సు అధికారి రాజిరెడ్డి, పీడీ మెప్మా ఇందిరా, DRDA అదనపు పీడీ సరస్వతి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది, వివిధ బూతు స్థాయి అధికారులు పాల్గొన్నారు విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.


Previous ఏడుపాయల జాతరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి
Next జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం
ADVERTISEMENT