అదనపు కలెక్టర్ రమేష్
డైలీ భారత్, మెదక్:గురువారం ఏడుపాయల జాతర ఆవరణలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుపాయల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా శాఖలను సమన్వయం చేస్తూ సకల సౌకర్యాలు పూర్తి చేసినట్లు చెప్పారు.
ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోప తండోలుగా తరలి వస్తారని. ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే వుంది. ఇప్పటికే 07 లక్షలకు పైగా భక్తులు దుర్గ భవాని మాతను దర్శించుకొనున్నట్లు ప్రాథమిక అంచనా వేసామని అన్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
జాతర నిర్వహణకు. త్రాగు నీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, , అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి , క్యూలైన్ ఏర్పాటు తదితర అనేక ఏర్పాట్లు చేశారు
గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోపాలను సరిదిద్దుకుంటు ఏర్పాట్లను విస్తృత పరిచారు. భక్తులకు సజావు దర్శనమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర యత్రంగాలు ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేశామని వివరించారు
జాతరకులక్షల సంఖ్యలో బక్తులు వస్తున్న నేపథ్యంలో. పారిశుధ్యం పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పారిశుధ్య నిర్వహణకు కార్మికులను ఎర్పాటు చేసిందన్నారు
మేడారం లో శాంతి బద్రతల పరిరక్షణకు, జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వేల పోలీస్ సిబ్బందితో సిసి కెమెరాలు, జాతర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఎర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి ఆలయ కార్యనిర్వాహణాధికారి మోహన్ రెడ్డి చైర్మన్ బాలా గౌడ్, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు