| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం

మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో మహిళలకు శాలువాలతో సన్మానం

డైలీ భారత్, మెదక్: జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో మరియు భరోసా సెంటర్ లో జిల్లా మహిళా సిబ్బందితో కలసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది.అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా జిల్లా ఎస్.పి. డా.బి.బాలస్వామి  మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ... మహిళలందరు కలసి కట్టుగా ఉండాలని  ఒక మహిళ చదువుకొని వుంటే ఆమె తన పిల్లలకు సమాజం పట్ల అవగాహనే కల్పించే అవకాశం వుంటుంది కాబట్టి ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా చదివించాలని, అప్పుడే ఆడపిల్లలు మగ పిల్లలతో సమానంగా అన్నీ రంగాలలో దూసుకెల్తారని అన్నారు.అలాగే ప్రతి నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు తమ పిల్లలకు సమాజంలో జరుగుతున్న మంచి చెడు పై అవగాహన కల్పిస్తూ వుండాలని అన్నారు.అలాగే మహిళలు ఆర్దికంగా కూడా బలపడాలని, కుటుంబ ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోందని, ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోందని. మహిళలు ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారని అన్నారు. అలాగే ఆడపిల్ల అనగానే చిన్న చూపు చూడకుండా తల్లిదండ్రులు ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా స్వేచ్ఛను ఇవ్వాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళల పురోగతి కూడా ఎంతో ప్రాధాన్యం వహిస్తున్నదని, ఒక ఆపదకర పరిస్థితి వస్తే వాటిని ఏవిధంగా ఎదురుకోవాలని, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే వాటిపై అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే మహిళల పట్ల అసభ్యకరంగా కానీ అవమానకరంగా కానీ ఎవరైనా ప్రవర్తిస్తే వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని  ఈ సంధర్భంగా అన్నారు. మహిళలు ఆపద సమయాల్లో అధైర్యపడకుండా, వెంటనే డయల్ 100 కు సమాచారం అంధించాలని, ఆడపిల్లలు మహిళలలు ఎల్లపుడూ అప్రమత్తంగా వుండాలని అన్నారు. ఎల్లవేళలా పోలీసువారు అందుబాటులో వుంటారని ఇట్టి విషయంలో ఆడపిల్లలు మహిళలు భయపడనవసరం లేదని అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ యంత్రాగం మహిళల భద్రత గురించి ప్రత్యేకమైన చర్యలు చేబడుతున్నట్లు ఎస్.పి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్ మహేందర్ ఆర్ ఐ నాగేశ్వరరావు ,డి సి ఆర్ బి సి ఐ మధుసూదన్ గౌడ్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ సిబ్బంది మరియు భరోసా సిబ్బంది చందన  ,శ్వేత, మంజుల, లావణ్య, సౌందర్య, శ్రీలత పాల్గొన్నారు.


Previous లోకసభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్ శాతం పెంచాలనే సంకల్పంతో రంగోలి కార్యక్రమం ఏర్పాటు
Next వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ADVERTISEMENT