Posted on 2024-02-29 06:33:42
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : మీరు మీ ఆస్తి పన్ను ఇంకా కట్టలేదా?.. పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయా.. అయితే మీ బకాయిలు చెల్లించుకునేందుకు ఇదే చక్కని అవకాశం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీ పై 90 శాతం రాయితీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకోసం ‘వన్ టైమ్ స్కీమ్’ (Property Tax one time scheme ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఓటిఎస్ కింద ప్రభుత్వం ఆస్తి పన్నుపై పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తుంది.
2022 23 సంవత్సరం వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పాత బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్ టైం స్కీం తీసుకొచ్చినట్టు తెలిపారు. 2023 మార్చి నాటికి ఆస్తి పన్ను, వడ్డీ, జరిమానాలు చెల్లించిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వారు చెల్లించిన 90% వడ్డీ మొత్తాన్ని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) ఆర్డర్ ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం సర్దుబాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.
మొత్తం బకాయిలు + బకాయిల వడ్డీ : రూ. 9,803.39 కోట్లు
OTS (2022-23)కి అర్హత కలిగిన అసెస్‌మెంట్‌ల సంఖ్య : 5,25,709
ఆస్తి పన్ను వసూళ్లు (లక్ష్యం 2023-24 కోట్లు) : 2,10 కోట్లు (జనవరి 2024 వరకు) : 1,268.49 కోట్లు.
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >