| Daily భారత్
Logo




ఏబీవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్లాకు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

News

Posted on 2024-02-28 07:15:55

Share: Share


ఏబీవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రెండవ బ్లాకు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

ఆర్థికంగా పీడించొద్దు .. మెరుగైన వైద్యాన్ని అందించండి

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారని వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు బుధవారం పట్టణంలోని పరిగి రోడ్డులో ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాక్ ను ఎమ్మెల్యే శంకర్ మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక మహిళా కౌన్సిలర్ శ్రావణితో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఏబీవీ ఆసుపత్రి దినదిన ప్రవర్తమానంగా వెలుగొందాలని అన్నారు. పేద ప్రజలను ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా ఎక్కువ ఖర్చు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని పేర్కొన్నారు. మంచి సాంకేతిక పరిజ్ఞానంతో విలువైన వైద్యంతో వారికి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. నేటి సమాజంలో ప్రైవేటు వైద్యం అందనీ ద్రాక్షగా మారుతోందని అందుకే ప్రైవేట్ సంస్థలు పేద ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వైద్యం అందించాలని సూచించారు. వ్యవస్థలో ఎవరు ఎన్ని సేవలు చేసిన ఏ రంగాల వారైనా సరే పేదల వైద్యం కోసం ఎప్పుడైనా సిఫార్సు చేస్తారని వారి సిఫార్సులను దృష్టిలో పెట్టుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు సూచించారు. వైద్య సేవల్లో మంచిని స్వీకరిస్తామని చెడును స్వీకరించబోమని దానికి అనుగుణంగానే ప్రైవేట్ ఆస్పత్రులు ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. రెండవ బ్లాక్ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శ్యాంసుందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రావణిలకు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇధ్రీస్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నేతలు అందే మోహన్ సయ్యద్ ఖదీర్ సింగారం సుదర్శన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >