| Daily భారత్
Logo




చెక్ డ్యాముల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

News

Posted on 2024-02-25 13:36:35

Share: Share


చెక్ డ్యాముల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వర్షాకాలం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి

గుడి చెరువులో మురికినీరు కలవకుండా కాలువల నిర్మాణం వెంటనే చేపట్టాలి

కోతకు గురైన చెరువులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పలు చెక్ డ్యాం ల ఎత్తులను తగ్గించాలి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

డైలీ భారత్, వేములవాడ: జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో  ఆదివారం ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలకు మూలవాగు పై నిర్మించిన చెక్ డ్యాం ల దగ్గర వరదకు దెబ్బతిన్న పొలాలు భవిష్యత్తులో మళ్లీ వరద తాకిడి కి ఇబ్బంది కాకుండా పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

కొనరావుపేట మండలం నిజామాబాద్,మామిడిపల్లి గ్రామల మధ్యలో నిర్మించిన చెక్ డ్యామ్ దగ్గర మరొకసారి వరద గురికాకుండా కట్టల నిర్మాణం మరియు చెక్ డ్యామ్ ఎత్తు తగ్గింపు గురించి విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా వేములవాడ మండలం బొల్లారం,లింగంపల్లి మధ్య నిర్మించిన చెక్ డ్యాం,జయవరం దగ్గర నిర్మించిన చెక్ డ్యాం దగ్గర దెబ్బతిన్న పొలాలు మరియు కోతకు గురైన పొలాలు తిరిగి యధాస్థితి కి తీసుకురావడనికి గల అంచనాలు రూపొందించడానికి చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే పూర్తయిన చెక్ డ్యాములకు సంబంధించి, మరిమడ్ల,నిమ్మపల్లి, కొండాపూర్,వెంకటరావుపేట మరియు మామిడిపల్లి పరిదిలోని నిర్మాణంలో చెక్ డ్యాం లు సంబంధించి భవిష్యత్తులో వరదలకు ఇబ్బంది కాకుండా నిర్మాణాలను చేపట్టాల్సిందిగా  ఆదేశించారు.

వేములవాడ పట్టణ పరిధిలోగల మల్లారం ఆనకట్ట నుండి గుడి చెరువుకు వచ్చే కట్టు కాలువ బుడగజంగాల కాలనీ వద్ద కాలనీ ముంపు గురవుతున్న విషయాన్ని ప్రస్తావించి కాలువలో గల పూడికతీయుట మరియు పై నుండి వచ్చే వరద మూలవాగులో వెళ్లి కలిసే విధంగా బుడగ జంగాల కాలనీ వద్ద నిర్మాణం చేపట్టాల్సిందిగా ఆదేశించారు.

పట్టణంలో గల మురికి కాలువలద్వారా నీరు గుడి చెరువులో కలవకుండా మూలవాగు వరకు కాలువలు నిర్మించుట కొరకు వేములవాడ మున్సిపల్ కమిషనర్ తో,కలిసి పరిశీలించి అంచనాల రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మద్య మానేరు నుండి అప్పర్ మానేరు వరకు నీరందించే ప్యాకేజీ-9 కి సంబంధించి పనుల పురోగతి తెలుసుకొని సింగసముద్రం చెరువు నుండి అప్పర్ మానేరు ప్రాజెక్టు వరకు గల బ్యాలెన్స్ పనులను,మలకపేట రిజర్వాయర్ యొక్క కుడి ఎడమ కాలువలు పూర్తి అవ్వడానికి కావలసిన నిధుల విడుదల గురించి ముఖ్యమంత్రి తో చర్చించడానికి కావాల్సిన నివేదికనలను పరిశీలించారు. బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తే తక్షణం 20 వేల నుండి 30 వేల ఎకరాల వరకు ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు.

కాగా ఈ సమావేశంలోనే బాల్కొండ డివిజన్ పరిధిలో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ తూముని,రెండు కిలోమీటర్ల కాలువని ఈ జిల్లా పరిధిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి అప్పగింత వల్ల నీటి యాజమాన్యం సులభంగా జరిగి ఎగువన ఉన్న బాల్కొండ నియోజకవర్గం లోని కోనాపూర్ గ్రామ ఆయకట్టుకి నీటిని అందించే బాధ్యతతో పాటు, వేములవాడ నియోజకవర్గం లోని భూషణ్రావుపేట్ ఊటపల్లి,చింతకుంట,కథలాపూర్ గ్రామల రైతులకి సాగునీరు అందించడం కోసం ఇంజనీర్ ఇన్ చీఫ్, నీటిపారుదల శాఖ, హైదరాబాద్ కి ఉత్తరం రాయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులకి సూచించడం జరిగింది... 

వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకి కథలాపూర్,మేడిపల్లి భీమారం మండలాలలో కోతకి గురి అయిన చెరువుల మరమ్మత్తులకి సంబంధించి వివిధ స్థాయిలో ఉన్న అంచనాలని త్వరితగతిన ఆమోదించి వచ్చే వర్షాకాలం లోపు చెరువుల మరమ్మత్తులను పూర్తిచేయాలని అధికారులని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఈ శివకుమార్,ఈఈ గంగం శ్రీనివాసరెడ్డి, ఈఈ అమరేందర్ రెడ్డి, సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >