| Daily భారత్
Logo




బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు అగ్నికి ఆహుతి

News

Posted on 2024-02-25 13:22:33

Share: Share


బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు అగ్నికి ఆహుతి

డైలీ భారత్, ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబిలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి..

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. కాగా ఫ్యాక్టరీలో 15 నుంచి 20 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

అగ్నిప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున స్పాట్ కు చేరుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని ఓ పోలీసు అధికారి తెలిపారు. 

ఈ బాణాసంచా ఫ్యాక్టరీ చాలా కాలం నుంచి టపాసులను తయారు చేస్తోంది. అయితే.. ఫ్యాక్టరీ యాజమాన్యం లైసెన్స్ తీసుకున్నారా లేదా అనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >