| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయ దేవి...

కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయ దేవి...

డైలీ భారత్, మహబూబాబాద్: పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం  ఎదురుగా ఉన్న వెనకబడిన తరగతుల బాలికల కళాశాల వసతి గృహాన్ని మంగళవారం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయ దేవి ఆకస్మిక తనిఖీ చేశారు.

తొలిత విద్యార్థినులతో ఆమె మాట్లాడారు. వారికి సంక్షేమ పథకాల కింద అందుతున్న వసతులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.

వంటగది నీ స్టోర్ రూమ్ను సందర్శించి పరిశీలించారు.

సన్న బియ్యం కందిపప్పు వంటి ఆహార పదార్థాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వాటి  నమూనా లను సేకరించి వెంట పట్టుకెళ్లారు.

రిజిస్టర్లను తనిఖీ చేస్తూ  నమోదు పై అధికారులను ప్రశ్నించారు. నిరంతరం వసతి గృహాలను పర్యవేక్షిస్తూ నివేదికలు అందజేయాలన్నారు.

అనంతరం మరుగుదొడ్లను కూడా పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

కమిషనర్ వెంట ఆర్డిఓ అలివేలు బీసీ అభివృద్ధి అధికారి నరసింహ స్వామి సహాయ బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ వసతి గృహ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Previous ఓటర్ల జాబితా పటిష్టంగా చేపట్టాలి :ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులు బాల మాయా దేవి
Next ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే శంకర్ ను పరిచయం చేసిన సిఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT