| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే శంకర్ ను పరిచయం చేసిన సిఎం రేవంత్ రెడ్డి

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే శంకర్ ను పరిచయం చేసిన సిఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: బడుగు బలహీన వర్గాలకు చెందిన మన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంచి లీడర్ అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గురించి ప్రత్యేకంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు పరిచయం చేశారు. మంగళవారం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వీర్లపల్లి శంకర్ వెళ్లారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారులు మల్లు రవి, సిడబ్ల్యుసి సభ్యులు వంశీ చంద్ రెడ్డి,  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, 

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అదేవిధంగా జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసిన వెంటనే ఏఐసిసి అధినేత మల్లికార్జున కార్గే మాట్లాడుతూ  మహబూబ్ నగర్ పార్లమెంట్ ఓవర్ లోడ్ అంటూ చమత్కరించారు. అన్ని నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేశారని ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ పరిచయం సమయంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అత్యంత బలమైన మాస్ లీడర్ అంటూ ప్రశంసిస్తూ పరిచయం చేయడం విశేషం. తెలంగాణలో ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టి శ్రేణులకు మంచి ఉత్సాహాన్ని నింపిన లీడర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిచయం చేయడం అందరిని అలరించింది. ముఖ్యంగా మొదటి నుండి తెలంగాణలో గెలిచే పక్కా గ్యారెంటీ నియోజకవర్గం షాద్ నగర్ అనే ప్రశంసలు గతంలో కొంతమంది ఏఐసీసీ నాయకులు తదితరులు చెప్పడం దానిని నిలబెట్టుకోవడం పట్ల ప్రశంసల వర్షం కురిసింది. ఈ విషయమై ఎమ్మెల్యే శంకర్ ను మాట్లాడగా ఢిల్లీకి ముఖ్యమంత్రితో కలిసి వెళ్లడం జరిగిందని పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలతో కలిసి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు స్థానాన్ని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో క్లీన్ స్విప్ చేయబోతుందని వీర్లపల్లి శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి పార్టీలోకి రావడం కూడా మంచి పరిణామం అన్నారు.

Previous కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయ దేవి...
Next తెలంగాణలో 9వేల అంగన్వాడి టీచర్లు, హెల్పేర్ల నోటిఫికేషన్ జారీ
ADVERTISEMENT