| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఓటర్ల జాబితా పటిష్టంగా చేపట్టాలి :ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులు బాల మాయా దేవి

ఓటర్ల జాబితా పటిష్టంగా చేపట్టాలి :ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులు బాల మాయా దేవి

ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులు బాల మాయా దేవి

డైలీ భారత్, మహబూబాబాద్: ఓటర్ల జాబితాను అత్యంత జాగ్రతతో ప్రణాళిక బద్దంగా పట్టిష్టంగా చేపట్టాలని ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులు బాల మాయా దేవి రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

మంగళవారం సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయం లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఓటర్ల జాబితా పై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ తో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఓటర్ల జాబితా పరిశీలకులు మాట్లాడుతూ...

పటిష్టమైన ఓటర్ల జాబితాకు ప్రణాళిక బద్దంగా పారదర్శకతతో విచారణ చేపట్టి పటిష్టమైన నివేదికను రూపొందించాలన్నారు.

తొలగించిన మృతుల ఓట్లు, డబల్ ఎంట్రీ ఓట్ల తొలగింపుకు ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందని , అధికారులు వివరించగా నివేదికలో తప్పనిసరిగా పొందుపరచాలని అనంతరం తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ఓటర్ ఫోటో గుర్తింపు (ఏపిక్) కార్డులు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

18 సంవత్సరముల కొత్త ఓటర్లను అత్యధికంగా గుర్తిస్తూ నిర్దేశించిన లక్ష్యాల శాతాన్ని  అధిగమించాలన్నారు. 

వంద సంవత్సరములు దాటిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయి పర్యవేక్షణలో గుర్తించి నమోదు చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్ మహబూబాబాద్ తొర్రూర్ ఆర్ డి వో లు అలివేలు నరసింహారావు తాసిల్దార్లు ఎన్నికల విభాగం అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Previous ప్రగతి సాధించేందుకు లక్ష్యంతో పని చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Next కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయ దేవి...
ADVERTISEMENT